
దళితుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా: డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
దళితుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా: డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
హైదరాబాద్ జనవరి13 (ప్రజాకలం జిల్లాప్రతినిధి) హరిత హోటల్ ప్లాజాలో రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షులుగా కవంపల్లి సత్యనారాయణ గారి బాధ్యత స్వీకరణ ప్రిపరేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు గారు జేబి రాజుగారు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ కుల బాంధవులకు హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుతూ అనంతరం మాట్లాడుతూ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్సీల హక్కులకు అనేకమైన సేవలు అందిస్తానని అలాగే ఎస్సీలకు ఏ ఇబ్బంది కలిగిన అవన్నీటికి సమాధానం చెప్పే విధంగా కృషి చేస్తానని ఎస్సీలకు రావలసిన ఉపాధి పథకాలు అతి త్వరలో వచ్చే విధంగా కృషి చేస్తానని మీ ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి ఎస్సీల హక్కులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తానని ఎస్సీల అభివృద్ధి కి పాటు పడతానని ఒక శాసనసభ్యునిగ ఉన్నాను కాబట్టి సీఎం గారితో చెప్పి ప్రతి విషయంలో ఎస్సీలకు మంచి స్థానం కల్పించే విధంగా కృషి చేస్తా ప్రతి ఒక్క కార్యకర్తను నాయకులను చురుకుగా పని చేసే ముఖ్య నాయకులను కాపాడుకునే విధంగా కృషి చేస్తాను ముఖ్యమంత్రి గారి దగ్గర ఎస్సీలకు హక్కులు మరియు ఎస్సీలకు రావాల్సిన వాటాలు కూడా వచ్చే విధంగా కృషి చేస్తానని మాట ఇచ్చారు మనమందరం ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున ఒక సైనికుల కాంగ్రెస్ పార్టీకి కంచుకోటల కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ అధిష్టానం చెప్పిన విధంగా తూచా తప్పకుండా పార్టీ కొరకై అనునిత్యం భక్తి శబ్దలతో పనిచేయాలని చెప్పారు ఇక్కడకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీపిసిసి ఉపాధ్యక్షులు నమిండ్ల శ్రీనివాస్ టిపిసిసి స్టేట్ సీనియర్ వైస్ చైర్మన్ ఆర్గనైజేషన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ గారు పత్తి కుమార్ దెబ్బేట రమేష్ అతికొరనేల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అరుణ్ ఆరేపల్లి రాజేందర్ తిప్పర్తి స్త్రీధర్ జలపల్లి నరేందర్ దుర్గం భాస్కర్ 33 జిల్లాల నాయకులు కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది

