26 వార్డులకు 289 నామినేషన్లకు ఆమోదం…

26 వార్డులకు 289 నామినేషన్లకు ఆమోదం…

మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల్లో
26 వార్డులకు 289 నామినేషన్లకు ఆమోదం…
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జనవరి 31 (ప్రజా కలం) మెట్‌పల్లి లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 26 వార్డులకు సంబంధించి దాఖలైన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు శనివారం పరిశీలించారు.291 నామినేషన్ లు దాఖలు కాగా ఈ పరిశీలనలో మొత్తం 289 నామినేషన్లు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారించి, అన్నింటినీ చెల్లుబాటు అయినవిగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి 104 నామినేషన్లు, బీజేపీ 56, బీఆర్‌ఎస్ 56, ఏఐఎంఐఎం పార్టీ నుంచి 8, జనసేన పార్టీ 14, ఆమ్ ఆద్మీ పార్టీ 5, బీఎస్పీ 1, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2,ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంలో నమోదు అయిన ఇతర రాజకీయ పార్టీల నుంచి మొత్తం 10 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులు 33 మంది నామినేషన్ లకు అధికారులు అమోదం తెలిపారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )