
కొండగట్టు ఆర్టీసీ బస్సు–లారీ ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం
కొండగట్టు ఆర్టీసీ బస్సు–లారీ ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం
జగిత్యాల ప్రతినిధి ఆగస్టు 17 (ప్రజాకలం)
కొండగట్టు వద్ద కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ప్రమాద ఘటనపై జగిత్యాల జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో మంత్రి ఫోన్‌లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన వైద్య సహాయం అందేలా చూడాలని అధికారులకు సూచించారు.
అలాగే బాధిత కుటుంబాలకు అండగా ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను ఆర్టీసీ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు..ప్రమాద ఘటనపై సమగ్ర వివరాలు సేకరించి, బాధితులకు తక్షణ సహాయం అందించడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.

