నగల చోరి కేసులో వేగవంతంగా దర్యాప్తు…

నగల చోరి కేసులో వేగవంతంగా దర్యాప్తు…

నగల చోరి కేసులో వేగవంతంగా దర్యాప్తు…

నిందితుల అరెస్టు – రిమాండ్

మెట్ పల్లి పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ

మెట్ పల్లి కోరుట్ల ప్రతినిధి ఫిబ్రవరి 5 (ప్రజా కలం)పట్టణం చాకిరేవు వద్ద తల్లి కొడుకుల పై దాడి చేసి దాడి చేసి వన్నెల గంగు అనే మహిళా మెడలో నుండి 3 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన కేసులో నిందితులను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లాలోనే సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులు ఎక్కడ కూడా ఆనవాళ్లు లేకుండా చోరీ పాల్పడిన ఈ ఘటనను సంబంధించిన ఈ కేసులో మెట్ పల్లి పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి వేగవంతంగా నిందితులను పట్టుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

మెట్ పల్లి డిఎస్పీ కార్యాలయంలో మెట్ పల్లి డి.ఎస్.పి రాములు తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పి అశోక్ కుమార్ కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మెట్ పల్లి పట్టణంలో గత జనవరి నెలలో వరుసగా ఆరు దొంగతనాలు జరిగినాయని రాములు తెలిపారు. ఈ వరుస ఘటనలకు సంబంధించి జిల్లా పోలీసు యంత్రాంగం సూచనల మేరకు మెట్పల్లి డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్, ఎస్‌ఐలు కిరణ్ కుమార్, అనిల్, నవీన్ లతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. ప్రత్యేక బృందాలు మెట్ పల్లి, నిజామాబాద్ ఇతర ప్రాంతాలు తిరిగి, సీసీటీవీ ఫుటేజ్, డాగ్ స్క్వాడ్ ఆధారంగా విచారణ కొనసాగించి నిందితులకు సంబంధించి సమాచారం సేకరించినట్లు పేర్కొన్నారు. విచారణలో భాగంగా మంగళవారం నాడు మెట్ పల్లి కొత్త బస్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పండుగ రమేశ్, పల్లెపు రమేశ్ లను సీఐ, సిబ్బంది కలిసి పట్టుకున్నారని ఎస్పి తెలిపారు. వారి వద్ద నుంచి బాధితురాలు వన్నెల గంగు వద్ద దొంగలించిన 3.5 తులాల బంగారు పుస్తెల తాడు, ఒక ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుల ఇచ్చిన సమాచారం మేరకు మిగతా నిందితులు గుంజే గంగాధర్, ఒర్సు గంగమణిలను కూడా అరెస్ట్ చేయగా,గంగాధర్ వద్ద నుంచి 2 తులాల బంగారు పుస్తెలతాడు, 1 తులం బంగారు చైన్,గంగమణి వద్ద నుంచి 2 తులాల బంగారు నెక్లెస్, 18 తులాల వెండి పట్టా గొలుసులు, నేరాల్లో పాల్గొన్న గైని కిరణ్ వద్ద నుంచి 11 తులాల వెండి పట్టా గొలుసులు,పెద్దూరు మల్లేశ్వరి వద్ద నుంచి 3 తులాల వెండి బ్రేస్‌లెట్,దొంగతనపు సొత్తు కొనుగోలు చేసిన ఇందూరి రాకేష్ వద్ద నుంచి 3 తులాల బంగారు నెక్లెస్,1తులం గోల్డ్ చైన్‌ను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. మొత్తంగా 7 మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు, 32 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని వెల్లడించారు. దొంగలను చాకచక్యంగా, వేగవంతంగా సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకున్న ఈ కేసులో మెట్ పల్లి డీఎస్పీ రాములు, సీఐ అనిల్ కుమార్, ఎస్‌ఐలు కిరణ్ కుమార్, అనిల్, నవీన్ లను సిబ్బందిని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )