
ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో ఇఫ్తార్ విందు..
ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో ఇఫ్తార్ విందు..
..హాజరైన ప్రముఖులు..
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి మార్చి 20(ప్రజాకలం)మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా టియుడబ్ల్యుజే. ఐజెయు ఆద్వర్యంలో రంజన్ సందర్భంగా శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పట్టణంలోని మక్కా మసీదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖులు, విలేకరులు పాల్గొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ. పట్టణంలో అన్ని మతాల వారు సోదరభావంతో ఉంటారని.ప్రతి పండగను అందరూ కలిసి ఆచరిస్తారని మతాలకు అతీతంగా ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం సంతోషదాయకం అన్నారు.


ఈ కార్యక్రమంలో కోరుట్ల మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు.కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జువాడి కృష్ణారావు, కౌన్సిలర్ లు ఖాజా అజీమ్, గుడికందుల అజయ్, నునుగొండ నరేష్, మాజీ కౌన్సిలర్ మహ్మద్ షాకీర్ సిద్ధికి, మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి, మాజీ సర్పంచ్ కొమిరెడ్డి లింగారెడ్డి, టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటీ శ్రీనివాసరావు, టీయూడబ్ల్యూజే ఐజేయు మెట్ పల్లి అధ్యక్షుడు డా: బూరం సంజీవ్, జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్, ఉపాధ్యక్షులు జంగం విజయ్, అఫ్రోజ్ , జిల్లా కార్యవర్గ సభ్యులు సాజిద్ పాషా, బాసెట్టి హరీష్, గౌరవ సలహాదారులు దాసం కిషన్ ,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, పింజర్ శివ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పొనగాని మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, ముత్యాల రమేష్ , ఓంకారి శ్రీనివాస్,బొల్లం రాజు,మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్ సభ్యులు ఆదిల్ పాషా, రమణ, ఏసమేని గణేష్, ఎండి అభిద్, శశి కుమారు, అమ్ముల ప్రవీణ్ ,తదితరులు పాల్గొన్నారు.



