
ఘనంగా రంజాన్ వేడుకలు
ఘనంగా రంజాన్ వేడుకలు
– మసీదులు, ఈద్గాల వద్ద ముస్లిం మైనార్టీల ప్రత్యేక ప్రార్థనలు
– ముస్లిం మైనార్టీలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు


మెట్ పల్లి, (కోరుట్ల) ప్రతినిధి మార్చి 21 (ప్రజా కలం) : మెట్ పల్లి, కోరుట్ల పట్టణాల్లో శనివారం రంజాన్ పండుగను ముస్లిం మైనార్టీ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. రెండు పట్టణాల్లోని మసీదుల్లో, పట్టణ శివారుల్లోని ఈద్గాల వద్ద ముస్లిం మైనార్టీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేడుకల్లో కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, కౌన్సిలర్ లు తదితరులు హాజరై పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ వేడుకల్లో పాల్గొన్న పలువురు ప్రజా ప్రతినిధులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ముస్లిం మైనార్టీలు, ప్రజా ప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు మత పెద్దలు, మత గురువులు తదితరులు పాల్గొన్నారు. కాగా రంజాన్ పండుగను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెట్ పల్లి డీఎస్పి రాములు ఆధ్వర్యంలో సీఐ అనిల్, ఎస్సై కిరణ్ కుమార్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.



