
కష్టకాలంలో జర్నలిస్టుకు అండగా ఐజేయూ మెట్పల్లి ప్రెస్ క్లబ్
కష్టకాలంలో జర్నలిస్టుకు అండగా ఐజేయూ మెట్పల్లి ప్రెస్ క్లబ్
ప్రమాదంలో గాయపడిన సీనియర్ జర్నలిస్టు నాగరాజుకు రూ.22 వేల ఆర్థిక సాయం

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 29 (ప్రజాకలం) జర్నలిస్టు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలుస్తామని ఐజేయూ మెట్పల్లి ప్రెస్ క్లబ్ మరోసారి చాటిచెప్పింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కరీంనగర్లోని ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగిత్యాల పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు నాగరాజును ఐజేయూ మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.నాగరాజు చికిత్సకు తోడ్పాటుగా ఐజేయూ మెట్పల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రూ.22 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మెరుగైన వైద్యం కోసం తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బూరం సంజీవ్, జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో జర్నలిస్టులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని, కష్టకాలంలో తోటి జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు అండగా నిలవడం జర్నలిస్టు సంఘాల బాధ్యత అని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఐజేయూ మెట్పల్లి ప్రెస్ క్లబ్ నిరంతరం కృషి చేస్తుందని వారు తెలిపారు.తోటి జర్నలిస్టు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జర్నలిస్టు సమాజం ఒక్కటిగా స్పందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. నాగరాజు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఐజేయూ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బూరం సంజీవ్, జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్, గౌరవ సలహాదారు దాసం కిషన్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ అఫ్రోజ్తో పాటు ప్రింట్ మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

