సంజయ్‌ మాటలు విడ్డూరం 

సంజయ్‌ మాటలు విడ్డూరం 

సంజయ్‌ మాటలు విడ్డూరం

 

అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారా..?

 

 

చిల్లర రాజకీయాలతో తప్పుదోవ పట్టించొద్దు…!!

 

పరాన్నజీవి’ అంటే ఏమిటో తెలుసా?

 

 

ఎమ్మెల్యే సంజయ్‌పై జువ్వాడి ఫైర్…

 

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి నవంబర్ 18 (ప్రజా కలం): కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌పై కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నియోజకవర్గంలో గతంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, అభివృద్ధి, అధికార వ్యవస్థ వినియోగం, భూ వ్యవహారాలు తదితర అంశాలను ప్రస్తావిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై పలు ఆరోపణలు చేశారు. తనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు వ్యక్తులు స్వప్రయోజనాల కోసం రాజకీయాలను ఉపయోగించుకుంటూ నియోజకవర్గంలోని శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కిరాయి వ్యక్తులను ఉపయోగించుకుంటూ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని నర్సింగరావు విమర్శించారు.ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కారం కాదన్నారు. గతంలో దోపిడీలు, అక్రమాలకు పాల్పడిన వారిలో కొందరు ఇప్పుడు పెద్ద నాయకులుగా చలామణి అవుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో కాలేజీ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వకుండా కాడి భూములు, పూడూరు, కిషన్‌నగర్‌ ప్రాంతాల్లో భూముల విక్రయాల వ్యవహారాలకు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌ను “వీకెండ్ ఎమ్మెల్యే”గా అభివర్ణించిన నర్సింగరావు.. నియోజకవర్గంలో ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేయలేదని, కోరుట్ల అభివృద్ధికి పెద్దగా చేసిందేమీ లేదని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను, అధికారులను ఇష్టానుసారంగా ఉపయోగించుకున్నారని విమర్శించారు. మెట్‌పల్లి క్లబ్‌ వ్యవహారంపైనా నర్సింగరావు పలు ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రజలు ఎవరు ఏం చేస్తున్నారో గమనించాలని కోరారు. అవినీతికి సంబంధించి బీఆర్‌ఎస్‌ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్యే సంజయ్‌ తన అవసరాలకు వ్యక్తులను ఉపయోగించుకొని తర్వాత పక్కన పెట్టడం అలవాటుగా మార్చుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ప్రజలకు అందిన ప్రయోజనాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఆవేశం పనికిరాదు.. ఆలోచనతో పని చేయాలన్నారు. ముందుగా మీ నాయకులను మీరు సరిదిద్దుకోండి” అంటూ బీఆర్‌ఎస్‌ నాయకులకు సూచించారు. ఒకే ఇంటికి మూడు ఇంటి నంబర్లు ఇచ్చిన ఘనత కూడా గత బీఆర్‌ఎస్‌ పాలకులదేనని ఆరోపించారు.ఐటీ, సోషల్‌ మీడియాను ఆధారంగా చేసుకుని బీఆర్‌ఎస్‌ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, తమ ఉనికిని కాపాడుకునేందుకు రౌడీ రాజకీయాలకు పాల్పడుతూ దాడులకు దిగుతున్నారని జువ్వాడి నర్సింగరావు ఆరోపించారు. తనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.రాజకీయ విమర్శలు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలని, వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండి ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని నర్సింగరావు హితవుపలికారు.

 

 

అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారా..? – జువ్వాడి

 

 

 

రాజకీయ అనుభవం లేకుండానే సంజయ్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉందని జువ్వాడి నర్సింగరావు అన్నారు. నిన్న తనపై జరిగిన దాడిపై సుదీర్ఘంగా మాట్లాడిన జువ్వాడి నర్సింగరావు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతిని ప్రశ్నిస్తే దాడులతో సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. సంజయ్‌ రాజకీయ అనుభవం లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సంజయ్‌ను ‘జాక్‌పాట్‌ ఎమ్మెల్యే’, ‘వీకెండ్‌ ఎమ్మెల్యే’ అంటూ విమర్శించారు. మీడియాలో హైలెట్‌ కావడానికే తరచూ ప్రెస్‌మీట్లు పెడుతున్నారని ఆరోపించారు. మెట్‌పల్లి క్లబ్‌ విషయంలోనూ ఎమ్మెల్యేపై జువ్వాడి నర్సింగరావు ఆరోపణలు చేశారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేక బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యేకు లేదని వ్యాఖ్యానించారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని సస్పెండ్‌ అయిన ఎమ్మెల్యే మీ తండ్రి కాదా? అంటూ సంజయ్‌ను ప్రశ్నించారు. ఆవేశంతో కాకుండా ఆలోచనతో వ్యవహరించి ప్రజలకు సేవ చేయాలని హితవు పలికారు.కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే తన పార్టీలో కొందరు గుండాలను పోషిస్తున్నారని జువ్వాడి నర్సింగరావు ఆరోపించారు. అవినీతిపై ప్రశ్నించే వారిపై దాడులు చేయించడం సరికాదని, ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందన్నారు.

 

 

‘పరాన్నజీవి’ అంటే ఏమిటో తెలుసా?

 

 

ఎమ్మెల్యే సంజయ్‌పై జువ్వాడి నర్సింగరావు ఎద్దేవా

 

 

మెట్‌పల్లి: తనను ‘పరాన్నజీవి’గా అభివర్ణించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌పై కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు తీవ్రంగా స్పందించారు. ‘పరాన్నజీవి’ అంటే అసలు ఏమిటో ఎమ్మెల్యేకు తెలుసా అంటూ ఎద్దేవా చేశారు. ఒకరిపై విమర్శలు చేసే ముందు తాను ఉపయోగిస్తున్న పదానికి అర్థం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విమర్శకు అర్థం తెలియకుండానే మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు కాకుండా ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై మాట్లాడితే బాగుంటుందని సూచించారు. తండ్రి చాటు ఎమ్మెల్యేగా ఎవరు ఉన్నారో ప్రజలకు తెలుసు అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )