యువత ఆర్థిక స్వావలంబన తోనే ప్రగతి*

యువత ఆర్థిక స్వావలంబన తోనే ప్రగతి*

*యువత ఆర్థిక స్వావలంబన తోనే ప్రగతి*

 

-జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష

 

-మహిళా జాబ్ మేళాకు అపూర్వ స్పందన

 

-​ఫాక్స్‌కాన్‌లో పెద్దపల్లి మహిళల హవా

 

 

 

పెద్దపల్లి,నవంబర్ 22 (ప్రజాకలం జిల్లా ప్రతినిధి):

మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించినప్పుడే కుటుంబంతో పాటు సమాజం కూడా సమగ్రాభివృద్ధి చెందుతుందని,నేటి మహిళా శక్తి తలచుకుంటే ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టించగలదని జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష అన్నారు.నిరుద్యోగ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా దాసరి ఉష ఆధ్వర్యంలో ఆదివారం శాంతినగర్ సింధూర ఐటీఐ కాలేజీ క్యాంపస్‌లో సురక్ష మ్యాన్‌పవర్ సర్వీసెస్,ఫిట్ అండ్ ఫ్యూచర్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ మహిళా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.దాదాపు 500 మంది మహిళలు పాల్గొని హైదరాబాద్ కొంగరకలాన్‌లోని ప్రముఖ ఫాక్స్‌కాన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో వందల సంఖ్యలో మహిళలు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఫాక్స్‌కాన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. హైదరాబాద్ యూనిట్‌లో ప్రస్తుతం 8 వేల మంది పనిచేస్తున్నారని, అందులో 6 నుంచి 7 వేల మంది మహిళలే ఉన్నారని తెలిపారు.రాబోయే మూడేళ్లలో ఈ సంఖ్య 33 వేలకు పెరుగుతుందని, తెలుగు లేదా ఆంగ్లం చదవడం వస్తే సరిపోతుందని చెప్పారు.ఉద్యోగులకు భోజనం,బస్సు సౌకర్యంతో పాటు రాత్రి షిఫ్టులలో భద్రతా సిబ్బందితో రవాణా,పిఎఫ్,ఈఎస్ఐ అందిస్తున్నట్లు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా బీసీ జేఏసీ చైర్ పర్సన్ దాసరి ఉష మాట్లాడుతూ.. ఉద్యోగాల్లో చేరే మొదటి రోజు తాను కూడా అభ్యర్థులతో పాటు వస్తానని,గెట్-టుగెదర్ ఏర్పాటు చేసి వారి జీతభత్యాలు,వసతి సౌకర్యాలను పరిశీలిస్తానని భరోసా ఇచ్చారు.గతంలో డేటా సైన్స్ శిక్షణ ద్వారా ఎందరో యువత లక్షల్లో వేతనాలు పొందుతున్నారని,అదే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ పథకం కింద శ్రీమంత్ర ద్వారా నాలుగు నెలల నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్లేస్‌మెంట్ కల్పిస్తున్నట్లు తెలిపారు.గ్రామీణ యువత ఆత్మవిశ్వాసం తో పనిచేసి,భవిష్యత్తులో పెద్దపల్లిలోనే సొంతంగా కంపెనీలు స్థాపించే పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఫాక్స్‌కాన్ ప్రతినిధులు వీర్,మహేష్,సురక్ష మ్యాన్‌పవర్ సర్వీసెస్ ప్రతినిధులు దినేష్,కిరణ్,రజిత,మమత, రోహిత్,రాహుల్,హనీ,అక్షయ్,ప్రదీప్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )