హైనా సంచారం..!!

హైనా సంచారం..!!

హైనా సంచారం..!
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూన్ 26 (ప్రజా కలం)మెట్ పల్లి మండలం రంగారావుపేట శివారులో ఓ జంతువు సంచరించిన విషయం పై ఫారెస్ట్ అధికారులు క్లారిటీ ఇచ్చారు. గ్రామ శివారులోని తాతమ్మ గుడి సమీపంలోని భూముల్లో పాదముద్రలను గమనించిన గ్రామస్తులు గురువారం ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆ ప్రాంతానికి వెళ్లిన అధికారులు పాదముద్రలు గుర్తించి హైనా సంచారించిందని, ఆ పాదముద్రాలు హైనా కి సంబదించినవని తేల్చారు.గతంలో ఈ ప్రాంతంలో చిరుత సంచరించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు.ముందు జాగ్రత్తగా గ్రామస్తులు హైనా సంచారించిన ప్రాంతం వైపు వెళ్లొద్దని అధికారులు సూచనలు చేశారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )