
దిల్‌సుఖ్‌నగర్‌లో మాంగళ్య షాపింగ్ మాల్ 32వ శాఖ ప్రారంభం
హైదరాబాద్, దిల్‌సుఖ్‌నగర్ జులై 17,(ప్రజా కలం) తెలంగాణలో వస్త్ర వ్యాపార రంగంలో తనదైన గుర్తింపు పొందిన మాంగళ్య షాపింగ్ మాల్ దిల్‌సుఖ్‌నగర్‌లో తన 32వ శాఖను ఘనంగా ప్రారంభించింది. సినీ నటి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి మాల్‌ను ప్రారంభించారు. అనంతరం మాల్‌లోని వివిధ విభాగాలను సందర్శించి అభిమానులతో ముచ్చటించారు. ఆమె రాకతో ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి సందడి చేశారు.
2012లో వరంగల్‌లో ప్రారంభమైన మాంగళ్య షాపింగ్ మాల్, నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందిస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించింది. తాజాగా దిల్‌సుఖ్‌నగర్‌లో 32వ శాఖను ప్రారంభించి తన వ్యాపార విస్తరణను కొనసాగిస్తోంది.
ఈ సందర్భంగా నటి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. “దిల్‌సుఖ్‌నగర్ ప్రజలు మాంగళ్య షాపింగ్ మాల్‌కు విశేష ఆదరణ అందిస్తారని నమ్ముతున్నాను. వారి ఆశీస్సులతో ఈ శాఖ మరింత విజయవంతం కావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
మాంగళ్య షాపింగ్ మాల్ డైరెక్టర్లు పుల్లూరు నరసింహమూర్తి, కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రతి వర్గానికి, ప్రతి సందర్భానికి అనువైన నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరల్లో అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. స్వంత హ్యాండ్‌లూమ్ ఉత్పత్తులను ఆధునిక ఫ్యాషన్‌కు అనుగుణంగా రూపొందిస్తూ వస్త్ర రంగంలో ముందంజలో కొనసాగుతున్నామని పేర్కొన్నారు.
మాల్‌లో మహిళలు, పురుషులు, యువత, చిన్నారుల కోసం తాజా ఫ్యాషన్ దుస్తులతో పాటు వివాహాలు, శుభకార్యాల కోసం ప్రత్యేక వెడ్డింగ్ కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రూ.99 నుంచి రూ.1 లక్ష వరకు వివిధ ధరల శ్రేణిలో వస్త్రాలు లభిస్తాయని, కుటుంబ సభ్యులందరికీ ఒకేచోట షాపింగ్ చేసే సౌకర్యం కల్పించామని వెల్లడించారు.
మూడు రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మాంగళ్య షాపింగ్ మాల్ త్వరలో మరో 10 కొత్త శాఖలను ప్రారంభించనున్నట్లు డైరెక్టర్లు తెలిపారు. అనంతరం తమిళనాడులో కూడా విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.

