మహేశ్వరం మరో కోకపేట కావడం ఖాయం

మహేశ్వరం మరో కోకపేట కావడం ఖాయం

మహేశ్వరం మరో కోకపేట కావడం ఖాయం

ప్రపంచ దేశాల చూపు మహేశ్వరం వైపు

ఫ్యూచర్ సిటీలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలి

పార్టీలకు అతీతంగా మన ప్రాంత అభివృద్ధి కోసం అందరూ ముందుకు రావాలి

రాష్ట్రంలో ఎక్కడ జరగని అభివృద్ధి ఫీచర్ సిటీలోనే

మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నాయకుడు గద్దగూటి మహేందర్ ముదిరాజ్

మహేశ్వరం, జూన్ 08,(ప్రజా కలం)

ఫ్యూచర్ సిటీలో జరిగే అభివృద్ధి కోసం ప్రపంచ దేశాలు మహేశ్వరం వైపు అడుగులు వేస్తున్నాయని
మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నాయకుడు గద్దగూటి మహేందర్ ముదిరాజ్ అన్నారు. సందర్భంగా మహేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈనెల 10న ఫ్యూచర్ సిటీలో జరిగే ముఖ్యమంత్రి బహిరంగ సభను భారీ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా మన ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రతి ఒక్కరు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ జరగని అభివృద్ధి ఫ్యూచర్ సిటీలో జరుగుతుందని భవిష్యత్తులో మరో కోకాపేటగా మహేశ్వరం మారడం ఖాయమన్నారు. అభివృద్ధికి పేరుగా మహేశ్వరం ఫ్యూచర్ సిటీ అభివృద్ధి జరుగుతుందని ఎంతమంది నేతలు వచ్చినా మహేశ్వరం అభివృద్ధి కాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని అభివృద్ధి కోసం అందరం యువత మేధావులు అన్ని పార్టీల నాయకులు కలసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రపంచ దేశాలు సైతం ఇక్కడ వ్యాపారం చేయడానికి ముందుకు వస్తున్నాయని పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని భవిష్యత్తు తరాలకు బంగారు బాటగా నిలుస్తుందని మహేందర్ అన్నారు. ఈనెల 10న జరగనున్న భారీ బహిరంగ సభ ను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని విభాగాల కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందుకు అందరూ వచ్చే విధంగా అందరినీ తరలించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కార్యక్రమానికి కనివిని ఎరుగని విదంగా విజయవంతం చేద్దామని ఆయన మహేందర్ ముదిరాజ్ కోరారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )