
మెడికవర్ హాస్పిటల్స్ లో అరుదైన WPW (గుండె విద్యుత్ ప్రవాహంలో సమస్య)సిండ్రోమ్ కు విజయవంతమైన చికిత్స
మెడికవర్ హాస్పిటల్స్ లో అరుదైన WPW (గుండె విద్యుత్ ప్రవాహంలో సమస్య)సిండ్రోమ్ కు విజయవంతమైన చికిత్స
హనుమకొండ ఏప్రిల్ 3 ప్రజా కలం ప్రతినిధి
వరంగల్ మెడికల్ హాస్పిటల్ లో కార్డియాలజిస్ట్ డాక్టర్ సంతోష్ మోదాని గుండెకు సంబంధించిన సమస్యను విజయవంతంగా నిర్వహించారు.గుండె వేగంగా కొట్టుకోవడంతో 40 ఏళ్ల మహిళకు వైద్యులు విజయవంతంగా చికిత్స అందించారు.గత మూడు నెలలుగా రోగికి తరచుగా గుండె వేగం ఒక్కసారిగా పెరిగి నిమిషానికి 250 బీట్‌ల వరకు నమోదవుతూ ఉండేదనీ వైద్య పరీక్షల్లో ఆమెకు సుప్రావెంట్రిక్యులర్ టాకీకార్డియా (SVT) సమస్య ఉన్నట్లు గుర్తించారు.ECG పరీక్షలో గుండె విద్యుత్ ప్రసరణ వ్యవస్థలో అదనపు మార్గం ఉన్నట్లు తేలడంతో దీనిని (WPW) (గుండె విద్యుత్ ప్రవాహంలో సమస్య) సిండ్రోమ్ గా నిర్ధారించారు.కార్డియాలజీ నిపుణులు ముందుగా ఎలెక్ట్రోఫిజియాలజీ స్టడీ (EPS) ద్వారా గుండెలోని అసాధారణ విద్యుత్ మార్గాన్ని ఖచ్చితంగా గుర్తించి,అనంతరం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా ఆ మార్గాన్ని తొలగించారు.ఈ కేసులో గుండె ఎడమ వైపున ఉన్న అదనపు మార్గాన్ని చేరుకోవాల్సి రావడంతో ట్రాన్స్‌సెప్టల్ పంక్చర్ అనే ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.ఈ క్లిష్టమైన ప్రక్రియను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంతోష్ మోదాని విజయవంతంగా నిర్వహించారు.
చికిత్స అనంతరం రోగి పూర్తిగా కోలుకుని ప్రస్తుతం ఆరోగ్యంగా సాధారణ జీవితం గడుపుతున్నారనీ,ఈ సందర్భంగా డాక్టర్ సంతోష్ మోదాని మాట్లాడుతూ, WPW వంటి గుండె రిధమ్ సమస్యలను సమయానికి గుర్తించి సరైన చికిత్స అందిస్తే తీవ్రమైన సమస్యలను నివారించవచ్చని తెలిపారు.

