*బతికున్నోడికి ‘మరణ’ శాసనం*

*బతికున్నోడికి ‘మరణ’ శాసనం*

*బతికున్నోడికి ‘మరణ’ శాసనం*

 

-మంథని గిర్దావర్ అనిల్ కుమార్ సీసీఎల్‌ఏకు సరెండర్..!

 

-తప్పుడు విరాసత్ నివేదికపై అదనపు కలెక్టర్ విచారణ పూర్తి

 

-జిల్లాకు సేవలు అవసరం లేదని తేల్చిన యంత్రాంగం

 

-అధికారిక వర్గాల సమాచారం

 

పెద్దపల్లి,అక్టోబర్ 14 (ప్రజాకలం జిల్లా ప్రతినిధి):

రెవెన్యూ శాఖలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం,

అవకతవకలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవన్న సంకేతాలను జిల్లా యంత్రాంగం పంపుతోంది.బతికున్న వ్యక్తిని రికార్డుల్లో మరణించినట్లుగా చూపి,తప్పుడు విరాసత్ చేసిన వ్యవహారంలో మంథని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్‌ను చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది.విశ్వసనీయ సమాచారం మేరకు…ఈ వ్యవహారంపై గతంలోనే సస్పెన్షన్‌కు గురైన సదరు గిర్దావర్‌పై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అదనపు కలెక్టర్ పూర్తి స్థాయి విచారణ నిర్వహించారు.విచారణ నివేదికలో నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు నివేదిక ఇచ్చినట్లు గుర్తించినట్లు తెలిసింది.అలాగే విధి నిర్వహణలో అలసత్వం,సమీక్షలు,అంతర్గత విచారణల సందర్భాల్లో క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరించడం వంటి అంశాలను సైతం నివేదికలో ఉన్నతాధికారులు నమోదు చేసినట్లు సమాచారం.ఈ విచారణ నివేదికను పరిశీలించిన జిల్లా కలెక్టర్,సదరు ఉద్యోగి సేవలు జిల్లాకు అవసరం లేదని నిర్ణయిస్తూ,ఆయనను సీసీఎల్‌ఏకు సరెండర్ చేస్తూ ఉన్నతాధికారులకు నివేదించినట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం అందింది.జిల్లా యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం స్థానిక రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )