
అంగన్వాడీ కేంద్రంలోకి పాము..
అంగన్వాడీ కేంద్రంలోకి పాము..
– చిన్నారులకు తప్పిన పెను ప్రమాదం
మల్లాపూర్, అక్టోబర్ 31 (ప్రజాకలం ప్రతినిధి):
మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలోకి శనివారం మధ్యాహ్నం పాము చొరబడటంతో చిన్నారులు భయాందోళనకు గురయ్యారు.దీంతో అప్రమత్తమైన ఆయా, చిన్నారులను ఓ గదిలోకి పంపించి తలుపులు మూసివేయడంతో పెను ప్రమాదం తప్పింది, అంగన్వాడీ ఆయా, టీచర్ సెక్టార్ సమావేశానికి వెళ్లినట్లు చెప్పగా, సూపర్వైజర్ ప్రతిభ మాత్రం అంగన్వాడీ టీచర్ సెలవులో ఉన్నట్లు తెలిపారు.అయితే సమావేశానికి వెళ్ళింది అని ఆయా , లీవ్ లో ఉంది అని సూపర్ వైజర్ తెలుపడం ఇద్దరివి పొంతనలేని సమాధానాలు రావడం టీచర్ విధి నిర్వహణ పై అనుమానానికి తావు ఇచ్చినట్లు అయింది.ఏది ఏమైనా అంగన్వాడి కేంద్రంలో పాము దూరింది అనే ఘటన తల్లిదండ్రులకు భయాందోళన కు గురి చేస్తుంది.
TAGS Hot News

