
నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో నలుగురి అరెస్టు – రిమాండ్
నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో నలుగురి అరెస్టు – రిమాండ
మెట్ పల్లి సీఐ సురేష్ బాబు
మెట్ పల్లి కోరుట్ల ప్రతినిధి జూన్ 14 (ప్రజాకలం) తాహసిల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు మెట్ పల్లి తాహసిల్దార్ ఆఫీస్ అధికారిక ముద్ర, తాహసిల్దార్, అధికారిక ముద్ర నకిలీ ముద్రలను తయారు చేసి నకిలీ పత్రాలను సృష్టించిన కేసులో నలుగురు నిందితుల అరెస్టు చేసి ఆదివారం నాడు రిమాండ్ కు తరలించినట్లు మెట్ పల్లి సిఐ సురేష్ బాబు తెలిపారు. ఈ మేరకు సిఐ సురేశ్ బాబు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గత నెలలో మెట్ పల్లి తాహసిల్దార్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, మెట్ పల్లి తాహసిల్ ఆఫీస్ ముద్రలను నకిలీవి చేసి వాటి సాయంతో నకిలీ పత్రాలను తయారు చేసి వాటి ద్వారా అరపేట శివారులో గల సర్వేనెంబర్ 191 భూమిలో గల 8 గుంటల భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించినట్లు పేర్కొన్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో తహశీల్దార్ మెట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఈ కేసును జగిత్యాల ఎస్పీ ఆదేశాల మేరకు మెట్ పల్లి డిఎస్పి రాములు పర్యవేక్షణలో మెట్ పల్లి ఎస్సై, సిబ్బంది ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి కేసులో దర్యాప్తు చేసి ఆరుగురు నిందితులను గుర్తించి వారిలో నలుగురు నిందితులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.ఈ కేసులో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేశ్, పాకాల రాకేశ్ లను ఆదివారం అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నకిలీ పత్రాలకు తాయారు చేయడానికి ఉపయోగించిన కంప్యూటర్ ఇతర పరికరాలు, రబ్బరు స్టాంపులను కూడా సీజ్ చేసినట్లు వివరించారు. నిందితులను మెట్ పల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. ఈ కేసులో నిందితులు రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేశ్, బెజ్జారపు మధుసూదన్, పాకాల రాకేశ్, అంగారి శంకర్ లు కుమ్మక్కై నేరానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఆరపేట శివారులోని సర్వే నెం.191/ఈలో గల వివాదాస్పద భూమిని విక్రయించేందుకు నిందితులు కుట్ర పన్నారని, భూమికి ఆబాది సర్టిఫికేట్ జారీ చేయడానికి తహసీల్దార్ కార్యాలయం నిరాకరించినప్పటికీ, డాక్యుమెంట్ రైటర్ పాకాల రాకేశ్ తన కంప్యూటర్లో నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి, తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ, అంగారి శంకర్ నకిలీ స్టాంపులు తాయారు చేసి నేరానికి సహకరించాడన్నారు. నకిలీ ఆబాది సర్టిఫికేట్ ఆధారంగా మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బెజ్జారపు మధుసూదన్ పేరుపై భూమిని రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. ఈ వ్యవహారంలో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేశ్, బెజ్జారపు మధుసూదన్ ఆర్థిక లాభం పొందినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ప్రజలు భూముల కొనుగోలు సమయంలో సంబంధిత ప్రభుత్వ రికార్డులు, ధ్రువపత్రాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని ఈ సందర్భంగా మెట్పల్లి పోలీసులు సూచించారు. ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేయడం, నకిలీ ధ్రువపత్రాలు తయారు చేయడం, వినియోగించడం వంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ సురేశ్ బాబు హెచ్చరించారు.

