విద్యార్థుల భవితతో ప్రభుత్వం చెలగాటం*

విద్యార్థుల భవితతో ప్రభుత్వం చెలగాటం*

*విద్యార్థుల భవితతో ప్రభుత్వం చెలగాటం*

 

-బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష

 

-జీవో 17ను రద్దు చేయాలని బీఆర్ఎస్ ధర్నా… పోలీసుల అరెస్టు

 

పెద్దపల్లి,జూలై 03:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)

తెలంగాణలోని గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దయనీయమని,ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ధ్వజమెత్తారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు జీవో 17ను రద్దు చేయాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు గడిచినా,నేటికీ విద్యార్థులకు కనీసం దుస్తులు,నోట్ బుక్కులు అందకపోవడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 17వల్ల తెలంగాణలోని చిన్న కాంట్రాక్టర్లు,చేనేత కార్మికుల పొట్టకొడుతున్నారని,ఈ విధానం వల్ల రాష్ట్ర సంపద ఇతర రాష్ట్రాలకు తరలిపోతోందని విమర్శించారు.చేనేత కార్మికులకు దక్కాల్సిన కాంట్రాక్టులను గుజరాత్ కంపెనీలకు కట్టబెట్టడం వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆమె ఆరోపించారు.గురుకులాల్లోని అవినీతిపై పోరాడుతున్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ భద్రతను రాజకీయ కక్షతో తొలగించడం దారుణమని, హైకోర్టు ఆదేశాలను సైతం ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని మండిపడ్డారు.విద్యార్థులకు అందజేసే ట్రంక్ పెట్టల కాంట్రాక్టును,డ్రగ్స్ కేసుల్లో నిందితుడైన వ్యక్తికి అప్పగించడం ద్వారా ప్రభుత్వ ఉద్దేశాలు ఏంటో అర్థమవుతోందని ఆమె ప్రశ్నించారు.ఇది విద్యార్థుల ఆరోగ్యం మరియు భద్రతతో చెలగాటం ఆడటమేనని హెచ్చరించారు.వెంటనే ప్రభుత్వం జీవో 17ను రద్దు చేసి,స్థానిక కాంట్రాక్టర్లకు,చేనేత కార్మికులకు న్యాయం చేయాలని,విద్యార్థులకు కావాల్సిన వసతులను తక్షణమే కల్పించాలని దాసరి ఉష డిమాండ్ చేశారు.నిరసన వ్యక్తం చేస్తున్న దాసరి ఉషా తో పాటు పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.ఈ నిరసన కార్యక్రమంలో బీరం రవి,బండ నిఖిల్,రాహుల్,అజీమ్,కన్నం శ్రావణ్,శంకర్,మహేష్ తోపాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )