బీడీ కార్మికులు, వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాలి

బీడీ కార్మికులు, వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాలి

బీడీ కార్మికులు, వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాలి

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ నిధులు వెంటనే విడుదల చేయాలి

కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

మెట్‌పల్లి:(కోరుట్ల) ప్రతినిధి 17(ప్రజా కలం) బీడీ కార్మికులు, వృద్ధులకు పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద లబ్ధిదారులకు రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మెట్‌పల్లిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజా సమస్యల పోరాటంలో భాగంగా ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీడీ కార్మికులు, వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకూడదన్నారు. అలాగే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద లబ్ధిదారులకు అందాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ప్రభుత్వానికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

 

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )