
అన్నా.. నన్ను దేవుడే పంపిండు
అన్నా.. నన్ను దేవుడే పంపిండు
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలిసిన సందర్భంగా.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగం
– జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు
గజ్వేల్ నియోజకవర్గం:10 ఏప్రిల్ 2026 ( ప్రజా కలం ప్రతినిధి )

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి శుక్రవారం నాడు మర్యాదపూర్వక భేటీ అయ్యారు.నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి, పుష్పగుచ్ఛాలందించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రులు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి,ఎమ్మెల్సీ ఎల్ రమణ,కోరుట్ల ఎమ్మెల్యే డా.కె. సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్ రావు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ దంపతులు వసంత సురేశ్, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రాగిడి లక్ష్మారెడ్డి తదితరులున్నారు.

