
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి
మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు పాషా
మెట్ పల్లి కోరుట్ల ప్రతినిధి మార్చి 09 (ప్రజా కలం) భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి చెప్పులు తొడిగి అవమానించిన నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చూడాలని మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబోదీన్ పాషా డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహనికి చెప్పులు తొడిగి అవమానించడం క్షమించరాని చర్య అని, నిందితులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణా ఉద్యమ సమయంలో రాజీవ్ గాంధి విగ్రహాన్ని ఉద్యమకారులు ధ్వంసం చేసారని, స్థానిక కాంగ్రెస్ నాయకుల సహకారంతో ఇటీవల బాగుచేయించామని, ఈ క్రమంలో ఇలాంటి చర్యలు చేపట్టడం అనైతిక చర్య అన్నారు. భారత దేశానికి వన్నె తెచ్చిన ప్రధాని రాజీవ్ గాంధీ అని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న నిందితులను ఉపేక్షించమని ఆయన హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.

