పార్సీ అంజుమన్ సభ్యుల కోసం మెడికవర్ ప్రత్యేక హెల్త్‌కేర్ ప్యాకేజీలు

పార్సీ అంజుమన్ సభ్యుల కోసం మెడికవర్ ప్రత్యేక హెల్త్‌కేర్ ప్యాకేజీలు

*పార్సీ అంజుమన్ సభ్యుల కోసం మెడికవర్ ప్రత్యేక హెల్త్‌కేర్ ప్యాకేజీలు – మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో బ్లూ ప్లానెట్ ఆడిటోరియం ఘన ప్రారంభం*

 

హైదరాబాద్, ఏప్రిల్ 28, ప్రజాకలం :

పార్సీ అంజుమన్ ఆఫ్ సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ ప్రత్యేక హెల్త్‌కేర్ భాగస్వామ్యాన్ని ప్రకటిస్తూ, ఆధునిక వైద్య అవగాహన మరియు కమ్యూనిటీ కార్యక్రమాల కోసం రూపొందించిన బ్లూ ప్లానెట్ ఆడిటోరియంను సీనియర్ ట్రస్టీ శ్రీ జహంగీర్ బిస్నే ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్సీ అంజుమన్ గ్రూప్ సభ్యులు మరియు వారి కుటుంబాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మెడికోవర్డ్ ఫ్యామిలీ హెల్త్ కార్డ్ను అందజేశారు.

 

ముఖ్య అతిథి శ్రీ జహంగీర్ బిస్నే మాట్లాడుతూ, “పార్సీ అంజుమన్ సభ్యుల ఆరోగ్య రక్షణ కోసం మెడికవర్ హాస్పిటల్స్ అందిస్తున్న ప్రత్యేక హెల్త్‌కేర్ ప్యాకేజీలు, ప్రివెంటివ్ చెకప్‌లు, వైద్య రాయితీలు మా కమ్యూనిటీకి ఎంతో మేలు చేస్తాయి. వైద్య సేవలను సమాజానికి మరింత చేరువ చేస్తూ, ఆరోగ్య అవగాహన కోసం బ్లూ ప్లానెట్ ఆడిటోరియంను ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇది కేవలం ఒక వేదిక మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు మెడికవర్ ఇచ్చిన విలువైన కానుక,” అని పేర్కొన్నారు.

 

ఈ ప్రత్యేక హెల్త్ కార్డ్ ద్వారా సభ్యులకు OP కన్సల్టేషన్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్లు, వార్షిక పూర్తి శరీర పరీక్షలు, డయాగ్నస్టిక్ సేవలపై రాయితీలు, ప్రాధాన్య అపాయింట్‌మెంట్ సదుపాయం, అత్యవసర వైద్య సేవలలో ప్రత్యేక సహాయం, ఇన్‌పేషెంట్ సేవలపై ప్రయోజనాలు వంటి అనేక ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

 

కృష్ణవేణి, సెంటర్ హెడ్, మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ మాట్లాడుతూ,“మెడికవర్ లక్ష్యం కేవలం చికిత్స అందించడం మాత్రమే కాదు, ప్రతి కమ్యూనిటీకి దీర్ఘకాలిక ఆరోగ్య భద్రత కల్పించడం కూడా. పార్సీ అంజుమన్ గ్రూప్‌తో ఈ భాగస్వామ్యం ద్వారా కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేస్తున్నాం. బ్లూ ప్లానెట్ ఆడిటోరియం ద్వారా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, వైద్య శిక్షణ, కమ్యూనిటీ వెల్‌నెస్ కార్యక్రమాలు మరింత విస్తరించనున్నాయి,” అన్నారు.

 

  • ఈ కార్యక్రమంలో పార్సీ అంజుమన్ ప్రతినిధులు, కమ్యూనిటీ సభ్యులు, మెడికవర్ వైద్యులు మరియు సిబ్బంది పాల్గొని, మెడికవర్ సమాజ ఆరోగ్యంపై చూపుతున్న కట్టుబాటును అభినందించారు.
CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )