
నిర్లక్ష్యపు ధోరణిలో అధికారులు….!
నిర్లక్ష్యపు ధోరణిలో అధికారులు….!
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్…!
రాష్ట్ర అవతరణ దినోత్సవం అనంతరం కూడా మేల్కొని తాసిల్దార్…!
రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, మే 5 (ప్రజాకలం):
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోని తాసిల్దార్ కార్యాలయంలో అధికారులు రాష్ట్ర అవతరణ దినోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు బేకార్ చేసినట్టు తేట తెల్లం అయింది.రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తూ గతంలోనే జీవోలు జారీ చేశారు.జిల్లా సమీకృత అధికారుల భవనాల సముదాయంలో కూడా ప్రతిష్టాత్మకంగా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమాలు సైతం అధికారికంగా జరిగాయి. అయినా అధికారులు ఇంకా మేల్కోలేరు అని అర్థమవుతుంది.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తొలి సమయంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను ఫోటోలనే ఉంచి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు రెండు రోజుల క్రితం జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాత చిత్రపటాలని పెట్టి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టడం విడ్డూరంగా ఉందంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వ అధికారుల పనితీరును ఏ విధంగా కొనసాగిస్తున్నారు అంటూ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ఆదేశాలను అమలు చేయడం ప్రభుత్వ అధికారుల ముఖ్య ఉద్దేశం,అయినా అధికారులు నిర్లక్ష్యపు ధోరణితో వ్యవహరించడం పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకోవడంపై కావాల్సిన చర్యలు సైతం ఇలాగే నిర్లక్ష్యం దూరంలో సాగుతున్నాయని అందుకు నిదర్శనంగా ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు తెరపైకి వస్తున్నాయని ప్రజలు తెలుపుతున్నారు. మండల స్థాయి విధులు నిర్వహించే అధికారులు సైతం ఇలాంటి ప్రభుత్వ ఆదేశాలపై నిర్లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కార్యక్రమంలో దాదాపు పదిమంది అధికారులు ఉన్న ఏ ఒక్క అధికారి కూడా ఈ తప్పును గుర్తించకపోవడం అధికారుల తీర్పు అద్దం పడుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఎం వివి ప్రసాద్ రావు, సీనియర్ అసిస్టెంట్ జగన్, ఆర్.ఐ లు శ్రీనివాస్, రమేష్, జూనియర్ సహాయకులు నాగరాజు, సహార, హేమంత్, వీ.ఆర్.ఏ లు భాస్కర్ మణికంఠ, వెంకటయ్య, హేమంత్, ఆపరేటర్ వెంకట్ తో తదితరులు పాల్గొన్నారు.

