మాల్టాలో జగిత్యాల యువకుడి దుర్మరణం

మాల్టాలో జగిత్యాల యువకుడి దుర్మరణం

మాల్టాలో జగిత్యాల యువకుడి దుర్మరణం

జగిత్యాల్ ప్రతినిధి ఆగస్టు 11 (ప్రజాకలo)

జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురకు చెందిన (27) ఏళ్ల యువకుడు యూరప్‌లోని మాల్టాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మహమ్మద్ జవ్వాద్ (27)మాల్టాలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, మంగళవారం కారులో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ట్రక్కు అతని కారును బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముజాహిద్‌ మహ్మద్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. విదేశీ గడ్డపై జగిత్యాల యువకుడు మృతి చెందడంతో ఇస్లాంపురలో విషాదఛాయలు అలుముకున్నాయి.ముజాహిద్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )