హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్..

హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్..

హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్..

 

 

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి, అక్టోబర్ 6(ప్రజా కలం): హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కేసులో 2024 నుంచి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్‌కు తరలించారు. ఠాకూర్ వినయ్ సింగ్ (31)ను మంగళవారం తెల్లవారుజామున కోరుట్ల బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. 2024 జూన్ 24న కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్‌లో పాత కక్షల నేపథ్యంలో పొగుల రాజేష్‌పై నిందితులు పథకం ప్రకారం దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై క్రైం నంబర్ 341/2024గా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే A-2 నుంచి A-6 వరకు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రధాన నిందితుడైన A-1 వినయ్ సింగ్ మాత్రం అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు.కోరుట్ల సీఐ కె. లక్ష్మీనారాయణకు అందిన విశ్వసనీయ సమాచారంతో ఎస్‌ఐ జి. శ్యామ్‌రాజ్ తన సిబ్బందితో కలిసి బస్టాండ్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించి, పంచుల సమక్షంలో చట్ట ప్రకారం కాన్ఫెషన్ పంచనామా నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

 

 

చట్టం నుంచి తప్పించుకోలేరు..

 

 

నేరాలకు పాల్పడి ఎంతకాలం పరారీలో ఉన్నా చివరకు చట్టం ముందు నిలబడాల్సిందేనని పోలీసులు హెచ్చరించారు. నేరాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, ప్రజలు నేర సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ప్రధాన నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన కోరుట్ల సీఐ కె. లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ జి. శ్యామ్‌రాజ్, పోలీసు సిబ్బందిని జగిత్యాల జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )