
చైన్ స్నాచింగ్ కేసు నిందితుల అరెస్ట్
చైన్ స్నాచింగ్ కేసు నిందితుల అరెస్ట్
చోరీ సొత్తుతో పాటు బైక్, సెల్‌ఫోన్లు స్వాధీనం
నిందితుల్లో ఇద్దరు మైనర్లు
వివరాలు వెల్లడించిన సిఐ రాజ్ కుమార్.
జగిత్యాల ప్రతినిధి నవంబర్ 4( ప్రజా కలం)
మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని పరారైన ముగ్గురు నిందితులను కొడిమ్యాల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మల్యాల సీఐ రాజ్‌కుమార్ వెల్లడించారు. వారి కథనం ప్రకారం నవంబర్ 3న గంగారం తండాకు చెందిన అజ్మీర దూరి (50) ఉదయం 9 గంటల సమయంలో సూరంపేట గ్రామ శివారులోని ఐకేపీ కేంద్రానికి వడ్లు ఆరబెట్టేందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమె మెడలో ఉన్న సుమారు రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నవంబర్ 4న నాచుపల్లి ఇటుక బట్టీల సమీపంలో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా, వారే ఈ దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. దీంతో నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి చోరీకి గురైన బంగారు పుస్తెలతాడుతో పాటు నేరానికి ఉపయోగించిన హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు ఉపయోగించిన బైక్ జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిప్పన్నపేట గ్రామంలో చోరీకి గురైన వాహనంగా గుర్తించారు.అనంతరం ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కోరుట్లకు చెందిన గణేష్‌తో పాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మైనర్లు కావడంతో వారి వివరాలను గోప్యంగా ఉంచామన్నారు.

