నవంబర్ నెలాఖరు వరకు..  జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

నవంబర్ నెలాఖరు వరకు.. జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

నవంబర్ నెలాఖరు వరకు..

జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలకు అనుమతి లేదు…జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రతినిధి నవంబర్ 2( ప్రజాకలం)

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్–1861 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగించకూడదని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించడం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం నిషేధమని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు పోలీస్ యాక్ట్ నిబంధనలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )