మైండ్‌ఫుల్ మార్నింగ్స్ కోసం టెంపెస్ట్ అడ్వర్టైజింగ్ చొరవ…

మైండ్‌ఫుల్ మార్నింగ్స్ కోసం టెంపెస్ట్ అడ్వర్టైజింగ్ చొరవ…

మైండ్‌ఫుల్ మార్నింగ్స్ కోసం టెంపెస్ట్ అడ్వర్టైజింగ్ చొరవ…
-పర్యావరణ అనుకూల చొరవతో వినూత్న కార్యక్రమం..
టెంపెస్ట్ అడ్వర్టైజింగ్ పర్యావరణానికి అనుకూలమైన “మైండ్‌ఫుల్ మార్నింగ్స్”కు మార్గం వేసింది
హైదరాబాద్: సృజనాత్మకతను సామాజిక బాధ్యతతో మిళితం చేస్తూ, టెంపెస్ట్ అడ్వర్టైజింగ్‌ ఆధ్వర్యంలో ఓ వినూత్నమైన, ఉపకరమైన పర్యావరణ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. మహావీర్ హాస్పిటల్‌తో కలిసి చేస్తున్న ఈ చొరవ ప్రతీ రోజు ప్రారంభాన్ని పచ్చదనంతో ప్రారంభించేలా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా.., మసాబ్ ట్యాంక్‌లోని మహావీర్ హాస్పిటల్‌ దంత విభాగం ద్వారా పర్యావరణహితమైన బాంబూ (వెదురు) టూత్‌బ్రష్‌లు, దీనిపైన అవగాహన కల్పించే సమాచార కరపత్రాలను రోగులు మరియు సందర్శకులకు పంపిణీ చేయనున్నారు.ఈ ప్రయత్నం ద్వారా ప్రతి ఉదయాన్ని ‘మైండ్‌ఫుల్ మార్నింగ్‌’గా మలచుకునేలా ప్రజలకు చైతన్యం కల్పించడమే లక్ష్యం.

టెంపెస్ట్ అడ్వర్టైజింగ్ ఆధ్వర్యంలో పొందించి ప్రారంభించబడి, మహావీర్ హాస్పిటల్‌ సహకారంతో విజయవంతంగా అమలుపర్చుతున్న ఈ ప్రచారం., ‘‘ప్రతి సంవత్సరం లక్షలాది మంది వినియోగిస్తున్న ప్లాస్టిక్ టూత్ బ్రష్‌లు లోతట్టు ప్రాంతాలు సహా మహాసముద్రాలలోకి చేరుతున్నందున పర్యావరణంపై వాటి హానికరమైన ప్రభావాన్ని హైలైట్ చేయడమే’’ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో బయోడిగ్రేడబుల్ వెదురు బ్రష్‌లు స్థిరమైనవే కాకుండా ఆరోగ్యకరమైన చిరునవ్వు చిరునామాగా నిలుస్తూ పచ్చని భూమి కోసం సురక్షితమైవిగా పనిచేస్తాయి.

“టెంపెస్ట్‌లో సృజనాత్మకత, మార్పుకు ప్రేరేపించే శక్తి ఉందని మేము విశ్వసిస్తున్నాము. ఈ ఆలోచన కేవలం దంత ఆరోగ్యానికే కాకుండా, పర్యావరణ ఆరోగ్యాం, పరిశుభ్రతకీ సైతం సంబంధించిది’’ అని టెంపెస్ట్ అడ్వర్టైజింగ్‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రేఖా ఒస్వాల్ తెలిపారు. “సామాజిక ప్రయోజనాన్ని కలిగించే ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడం మాకు గర్వకారణం. దీనిని అమలు చేసిన మహావీర్ హాస్పిటల్‌కు ప్రత్యేక కృతజ్ఞత”లని ఆమె అన్నారు.

ఇది టెంపెస్ట్ అడ్వర్టైజింగ్ ఆధ్వర్యంలో ఈ ఏడాది చేపట్టిన Go Mad for Good అనే థీమ్‌లో భాగంగా రూపొందించిన పలు సామాజిక కార్యక్రమాల్లో ఒకటి. 27 ఏళ్ల అనుభవం కలిగిన ఈ ప్రకటన సంస్థ, వ్యాపారం కోసం మాత్రమే కాకుండా సమాజంలో మంచి మార్పు కోసం ప్రకటనల శక్తిని ఉపయోగించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది.

ఎందుకంటే… ప్రతి మంచి మార్పు, ఓ పాత అలవాటును తొలగించడంతో ప్రారంభమవుతుంది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )