
మెట్ పల్లిని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలి
మెట్ పల్లిని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలి
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి, ఏప్రిల్ 02 (ప్రజాకలం) : మెట్ పల్లిని నియోజకవర్గ కేంద్రంగా తిరిగి ఏర్పాటు చేయాలని మెట్ పల్లి నియోజకవర్గ పునర్విభజన అడ్ హాక్ కమిటీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం నుండి జిల్లా కేంద్రంగా మెట్ పల్లి కొనసాగిందని, 1952 నుంచి నియోజకవర్గ కేంద్రంగా కొనసాగిందని గుర్తు చేశారు. 2009లో జరిగిన పునర్విభజన కార్యక్రమంలో భాగంగా మెట్ పల్లి నియోజవర్గాన్ని రద్దు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన జరగనున్న నేపథ్యంలో మెట్ పల్లిని తిరిగి నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బర్ల సాయన్న, జెట్టి లింగం, ఎర్రోళ్ల హనుమాన్లు, ఎండి షాకీర్, అందే మారుతి, కొమిరెడ్డి లింగారెడ్డి, యామ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
TAGS Hot News

