​కులగణన తర్వాతే ఎల్లాపి సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికలు

​కులగణన తర్వాతే ఎల్లాపి సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికలు

*​కులగణన తర్వాతే ఎల్లాపి సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికలు*

 

-సంఘం సీనియర్ నాయకులు,ఐక్యవేదిక కన్వీనర్ తూమ్ భీంసేన్ రావు

 

*ప్రస్తుత రాష్ట్ర కమిటీ గడువు మరో ఏడాది పొడిగింపు

 

-రాష్ట్ర అధ్యక్షునిగా వీర్ల వెంకటేశ్వర్ రావు కొనసాగింపు

కరీంనగర్,మే31:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)

కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎల్లాపు సంఘం రాష్ట్రస్థాయి అధ్యక్ష,కార్యదర్శుల కీలక సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.చింతకుంటలోని ఎల్లాపి సోషల్ కల్చరల్ ఎడ్యుకేషన్ సొసైటీ భవనంలో సంఘం సీనియర్ నాయకులు,ఐక్యవేదిక కన్వీనర్ తూమ్ భీంసేన్,ఉలిసే సదానందరావుల అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు,అధ్యక్ష,కార్యదర్శులు తరలివచ్చారు.కుల సంఘం బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణ మరియు రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికలపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు.సమావేశంలో పాల్గొన్న వివిధ ప్రాంతాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరిచారు.రాష్ట్రంలో ఎల్లాపి సామాజిక వర్గానికి సంబంధించి మొట్టమొదటగా సమగ్ర కులగణన చేపట్టాలని మెజారిటీ సభ్యులు డిమాండ్ చేశారు.సమాజంలో తమ జనాభా ప్రాతిపదికన హక్కులను సాధించుకోవడానికి ఈ కులగణన ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.ఈ ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాతే,ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర కమిటీని ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు.అంతవరకు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు వీర్ల వెంకటేశ్వర్ రావు కార్యవర్గాన్నే యథావిధిగా కొనసాగించాలని ప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానించారు. సభ్యుల అభిప్రాయాలు,ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న ఐక్యవేదిక కన్వీనర్ తూమ్ భీంసేన్ ఈ సందర్భంగా ఒక కీలక ప్రకటన చేశారు.రాష్ట్రంలో ఎల్లాపి కులగణన ప్రక్రియ ముగిసేవరకు,అంటే మరో ఒక సంవత్సరం పాటు ప్రస్తుత రాష్ట్ర కమిటీని ఎటువంటి మార్పులు లేకుండా యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.ఈ నిర్ణయం పట్ల సభలో ఉన్న ప్రతినిధులంతా హర్షం వ్యక్తం చేస్తూ మద్దతు తెలిపారు.

 

*సాయిని నర్సింగారావు కు సముచిత స్థానం*

 

మరోవైపు,ఎల్లాపి కుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తూ,తెలంగాణలోని వివిధ ఎల్లాపి సంఘాల బలోపేతానికి,ఐక్యతకు విశేష కృషి చేస్తున్న సంఘం సీనియర్ నాయకులు సాయిని నర్సింగారావు సేవలను ఈ సందర్భంగా పలువురు వక్తలు కొనియాడారు.ఆయన నిరంతర శ్రమను,నిబద్ధతను గుర్తించి,రాష్ట్ర కమిటీలో ఆయనకు అత్యున్నతమైన, సముచిత స్థానాన్ని కల్పించాలని మెజారిటీ ప్రతినిధులు గట్టిగా అభిప్రాయపడ్డారు.ఈ సమావేశం ఎల్లాపి సామాజిక వర్గంలో నూతన ఉత్తేజాన్ని నింపిందని,రాబోయే రోజుల్లో కుల సంక్షేమ కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వీర్ల వెంకటేశ్వరరావు,ప్రధాన కార్యదర్శి మల్కా రామ్మోహన్ రావు,సంఘం సీనియర్ నాయకులు శెట్టి జీవన్ రావు,పుప్పాల విక్రమసింహారావు, వెల్ముల శ్రీనివాసరావు,తూమ్ లక్ష్మీ కాంతారావు,రాచకొండ సత్యనారాయణ రావు,బొంతల శేఖర్ రావు,లక్కాకుల సురేందర్ రావు,వీర్ల రవీందర్ రావు, రాచకొండ శ్రీనివాస్ రావు,అనభేరి యుగంధర్ రావు,పణి రాజారావు తోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన సంఘం యూనిట్ల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు,సంఘాల ముఖ్య నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )