
రౌడీ షీటర్ల ప్రత్యేక నిఘా
రౌడీ షీటర్ల ప్రత్యేక నిఘా
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

-రెనోవేషన్ చేసిన మెట్‌పల్లి సర్కిల్ ఆఫీసును ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూన్ 24 (ప్రజా కలం) రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించిన రెనోవేషన్ చేసిన మెట్‌పల్లి సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్యాలయంలో కల్పించిన సౌకర్యాలు, రికార్డుల నిర్వహణ, భద్రతా చర్యలు, సిబ్బంది పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలను ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రేవ్ కేసులలో ఫోక్సో కేసులలో నిందితులకు శిక్షలు పడే విధంగా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు. ఏ ఓ పి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు.కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని, తరచుగా సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేయాలని, సిబ్బంది పనితీరును నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలనీ సి.ఐ కి సూచించారు. సర్కిల్ పరిదిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. డిఎస్పీ రాములు, సి.ఐ లు సురేష్ బాబు,లక్ష్మీ నారాయణ, డీసీఆర్బీ ఎస్.ఐ ప్రదీప్,ఎస్సైలు కిరణ్ కుమార్,అనిల్ ,చిరంజీవి, నవీన్, గంగాధర్,రాజునాయక్, రవికిరణ్, శ్రీధర్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


