
కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఖుతుబోద్దీన్ పాషా
కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఖుతుబోద్దీన్ పాషా
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 30 (ప్రజాకలం): కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా మెటపల్లి పట్టణానికి చెందిన ముస్లిం నాయకుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా నియమితులయ్యారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గజంగి నందయ్య బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. టీపీసీసీ డెలిగేట్ సభ్యుడు కల్వకుంట్ల సుజిత్ రావు నేతృత్వంలో పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.రాజకీయాల్లో చురుకుగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న పాషాకు జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు దక్కడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పలువురు నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వార్డు స్థాయి నుంచి తనను గుర్తించి ఈ అవకాశం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డికి పాషా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ఫిషర్మెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, కొమ్ముల చిన్నారెడ్డి, రోడ్డ రాజు, నల్లూరి సాగర్, ఇప్పపల్లి గణేశ్, కల్లెడ గంగాధర్, ఏలేటి వినోద్ రెడ్డి, బైండ్ల శ్రీకాంత్, గూడ సోల్లు ముత్యం రెడ్డి, గోపిడి నరేశ్, కళ్ళెం శ్రీను, ఎట్టం మల్లేశ్, సమీర్ సర్కార్ తదితరులు పాల్గొన్నారు.

