
బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీలో గోల్డ్ మెడల్ సాధించిన మెట్ పల్లి విద్యార్థి
బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీలో గోల్డ్ మెడల్ సాధించిన మెట్ పల్లి విద్యార్థి
మెట్ పల్లి టౌన్ ప్రతినిధి నవంబర్ 11( ప్రజా కలం): జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ (బీ.ఫార్మసీ)లో ప్రథమ శ్రేణితో ఉత్తీర్ణత సాధించి యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాడు. మెట్ పల్లి పట్టణంకు చెందిన మహ్మద్ ఇమ్రాన్ హైదరాబాద్ జేయన్టీయూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన పరీక్ష లో ఉత్తీర్ణత సాధించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. మహ్మద్ ఇమ్రాన్ యూనివర్సిటీ చివరి ఫలితాలలో గోల్డెమెడల్ సాధించడం పట్ల మెట్ పల్లి కి చెందిన విద్యావంతులు, మేధావులు హర్షం వ్యక్తం చేసి ఇమ్రాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి తదుపరి ఉన్నత విద్య కోసం ఫార్మ్-డీ లో ఉచిత సీటు పొందాడు. ఫార్మాసి విద్యలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి భవిష్యత్తులో సమాజానికి సేవ చేయాలని ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు ఆకాంక్షించారు.

